Paris Olympics | పారిస్: విశ్వక్రీడల 12వ రోజైన బుధవారం భారత్‌కు ఏదీ కలిసిరాలేదు. స్వర్ణం లేదా రజతం ఖాయం చేసుకున్న వినేశ్ ఫొగాట్ వంద గ్రాముల బరువు పెరిగిందన్న కారణంతో ‘అనర్హత’కు గురికాగా మిగిలిన క్రీడల్లోనూ దేశానికి ఆశించిన ఫలితాలు రాలేదు. పతకంపై ఆశలు రేపే సంగతి పక్కనబెడితే కనీసం మెరుగైన ప్రదర్శనలు చేయడానికీ మన అథ్లెట్లు నానా తంటాలు పడుతున్నారు. టేబుల్ టెన్నిస్‌లో క్వార్టర్స్ చేరిన భారత మహిళల బృందం.. 1-3తోజర్మనీ చేతిలో ఓడటంతో టీమ్ ఈవెంట్లో భారత్ కథ ముగిసినైట్టెంది. ఆకుల శ్రీజ, అర్చనా కామత్ డబుల్స్‌లో ఓటమితో బోణీ కొట్టగా సింగిల్స్‌లో మనికా బాత్రదీ అదే దారి. సోమవారం భారత పురుషుల జట్టు సైతం ప్రిక్వార్టర్స్‌లోనే వైదొలిగిన విషయం విదితమే.