RCB vs SRH : టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(52), అభిషేక్ శర్మ(23)లు శుభారంభమిచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో బౌండరీలతో చెలరేగిన హెడ్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. రెండో ఓవర్ నుంచి ఈ ఇద్దరూ బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లపై విరచుకుపడ్డారు. బౌలర్లు మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకే అన్నట్టు హెడ్, అభిశేక్లు ఉతికేస్తున్నారు. దాంతో, హైదరాబాద్ స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. 6 ఓవర్లకు స్కోర్.. 76/0
విల్ జాక్స్ వేసిన తొలి ఓవర్లో ఒక బౌండరీతో ఏడు పరుగులు వచ్చాయంతే. ఆ తర్వాత టాప్లే ఓవర్లో హెడ్ రెచ్చిపోయాడు. వరుసగా ఫోర్, సిక్స్ బాదగా.. అభిషేక్ ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. దాంతో మూడు ఓవర్లకే స్కోర్ 30 దాటింది. ఆ తర్వాత ఫెర్గూసన్, యశ్ దయాల్‌ను టార్గెట్ చేసిన ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు బౌండరీలతో హోరెత్తించారు.