Tom Curran | ఐపీఎల్ వేలంలో 1.5 కోట్లు.. అంతలోనే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌పై 4 మ్యాచ్‌ల నిషేధం..!
Tom Curran : ఇండియన్ ప్రీమియర్ మినీ వేలం(IPL Mini Auction)లో ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ టామ్ కరన్(Tom Curran) మంచి ధర పలికిన విషయం తెలిసిందే. కానీ, అంతలోనే ఈ యంగ్‌స్టర్‌పై వేటు పడింది. బిగ్‌బాష్ లీగ్(Big Bosh League 2023)లో ఆడుతున్న టామ్ కరన్..
Tom Curran : ఇండియన్ ప్రీమియర్ మినీ వేలం(IPL Mini Auction)లో ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ టామ్ కరన్(Tom Curran) మంచి ధర పలికిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా రెండు రోజలు క్రితం జరిగిన వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీ రూ.1.5 కోట్లకు అతడిని దక్కించుకుంది. కానీ, అంతలోనే ఈ యంగ్‌స్టర్‌పై వేటు పడింది. బిగ్‌బాష్ లీగ్(Big Bosh League 2023)లో ఆడుతున్న టామ్ కరన్.. అంపైర్‌తో గొడవ కారణంగా నాలుగు మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు.
అసలేం జరిగిందంటే..? బిగ్‌బాష్ లీగ్‌లో టామ్ కరన్ సిడ్నీ సిక్సర్స్‌కు ఆడుతున్నాడు. డిసెంబర్ 11న సిడ్నీ సిక్సర్స్, హొబార్త్ హరికేన్స్ జట్ల మధ్య మ్యాచ్ కోసమని కరన్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. అయితే.. అతడు పదే పదే పిచ్ మీదుగా నడవడం నాలుగో అంపైర్ గమనించాడు. వెంటనే కరన్‌ను అతడు అలా చేయొద్దని వారించాడు. కానీ, ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆ అంపైర్‌తో గొడవకు దిగాడు.
టామ్ కరన్

అంతటితో ఆగకుండా కోపంగా అతడికి సమీపంగా వెళ్లాడు. దాంతో, ఆ అంపైర్ భయంతో వణికిపోయాడనుకో. ఈ విషయాన్ని మ్యాచ్ రిపరీ బాబ్ పర్రీ(Bob Parry) సీరియస్‌గా తీసుకున్నాడు. మైదానంలో తన దురుసు ప్రవర్తన ద్వారా కరన్ క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలకు సంబంధించిన ఆర్టికల్ 2.17 ఉల్లంఘనకు పాల్పడ్డాడని తెలపాడు.
The vision everyone’s been waiting for.
This is the series of events that’s led to Tom Curran’s four-game suspension… pic.twitter.com/CRcBujbIl0
— 7Cricket (@7Cricket) December 21, 2023
అనంతంరం విచారణలో కరన్ తన తప్పును అంగీకరించాడు. దాంతో, కరన్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించారు. టామ్ కరన్ ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు సొదరుడు. బీబీఎల్‌లో ఇప్పటివరకూ ఈ ఆల్‌రౌండర్ 28 మ్యాచుల్లో బరిలోకి దిగాడు. 19 ఇన్నింగ్స్‌ల్లో 264 రన్స్ కొట్టాడు. ఈ లీగ్‌లో అతడి అత్యధిక స్కోర్.. 44.
ఇవి కూడా చదవండి
- Shashi Tharoor | పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సంతాప సందేశం రాయాల్సిన సమయం ఆసన్నమైంది : శశిథరూర్
- Harish Rao | సీఎం పదవుల కోసం పార్టీలు మారిండు.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజం
- Winter Menu | అంజీర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
- Sakshi Malik: కుస్తీ వదిలేస్తున్నా.. ఏడ్చేసిన సాక్షీ మాలిక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

