న్యూఢిల్లీ : శీతాకాలం రాగానే వణికించే చలి, హీటర్లు, బ్లాంకెట్లు, పొగలు కక్కే ఆహారం గుర్తుకొస్తాయి. చలికాలంలో (Winter Menu) పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్‌తో పాటు వింటర్ డైట్లో అంజీర్‌ను కూడా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అంజీర్‌లో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తాజాగా, డ్రైఫ్రూట్స్ రూపంలో ఎలా తీసుకున్నా ప్రజల ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తాయి. అంజీర్‌లో ఉండే సహజమైన వేడిమి శరీరానికి వెచ్చదనం అందిస్తుంది.
ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక వ్యవస్ధను ప్రేరేపించి సీజనల్ అస్వస్ధతలను నివారిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ ఉదయాన్నే అంజీర్ తీసుకోవడం ద్వారా మలబద్ధకానికి గుడ్‌బై చెప్పవచ్చు. ఇంకా అంజీర్‌తో ఆరోగ్య ప్రయోజాలను పరిశీలిస్తే..
శరీర ఉష్ణోగ్రత నియంత్రణ
ప్రేవుల ఆరోగ్యం మెరుగు
ఎముకల బలోపేతం
బరువు తగ్గుదల
Read More :