Todd Murphy | ఆరంగేట్రం టెస్టులోనే 5 వికెట్లు తీసిన ఆసీస్ నాలుగో ఆఫ్ స్పిన్నర్‌గా మర్ఫీ
నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా ఎడమ చేతివాటం స్పిన్నర్ టాడ్ మర్ఫీ అరుదైన ఘనత సాధించాడు. ఆరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన ఆసీస్ నాలుగో ఆఫ్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Todd Murphy : నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా ఎడమ చేతివాటం స్పిన్నర్ టాడ్ మర్ఫీ అరుదైన ఘనత సాధించాడు. ఆరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ ఘనత సాధించిన ఆసీస్ నాలుగో ఆఫ్ స్పిన్నర్‌గా మర్ఫీ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు భారత్‌పై ఆరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన రెండో ఆసీస్ బౌలర్ తనే. ఇంతకుముందు జాసన్ క్రెజా నాగ్‌పూర్‌లోనే 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. తొలి టెస్టు మ్యాచ్‌లోనై ఐదు, ఆ పైగా వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్లు ఎవరంటే..?
1. పీటర్ టేలర్ – 1987లో ఇంగ్లండ్‌పై ఇతను 5 వికెట్లు తీశాడు. సిడ్నీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కేవలం 78 రన్స్ ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
2. జాసన్ క్రెజా – 2008లో భారత్‌పై నాగ్‌పూర్‌లో 215 రన్స్ ఇచ్చి 8 వికట్లు పడగొట్టాడు. టీమిండియాపై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి ఆసీస్ ఆఫ్ స్పిన్నర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
3. నాథన్ లియాన్ – 2011లో శ్రీలంకపై లియాన్ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. గాలేలో జరిగిన మ్యాచ్‌లో అతను 5/34తో ఆకట్టుకున్నాడు.
4. టాడ్ మర్ఫీ – నాగ్‌పూర్ టెస్టులో మర్ఫీ 5 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ తీశాడు. అతను కీలకమైన రాహుల్, అశ్విన్, పూజారా, కోహ్లీలను ఔట్ చేశాడు. శ్రీకర్ భరత్‌ను ఎల్బీగా వెనక్కి పంపి ఐదో వికెట్ సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

