Rocket Rahuja : దేశవాళీ క్రికెట్లో మెరుపులు మెరిపించి ఆపై ఐపీఎల్‌తో టీమిండియా తలుపు తట్టిన కుర్రాళ్లు చాలామందే. ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్.. తదితరులు తమ విధ్వంసక ఆటతో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. తాజాగా ఈ జాబితాలో యువకెరటం తుషార్ రాహుజా (Tushar Rahuja) చేరడం ఖాయమనిపిస్తోంది. టీ20 ఫార్మట్‌లో జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో ఈ చిచ్చరపిడుగు పరుగుల వరద పారించాడు. బౌలర్ ఎవరైనా అతడు బౌండరీల మోత మోగించిన తీరుకు మాజీలు సైతం ఫిదా అయ్యారనుకో.
ఐపీఎల్లో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను వణికించిన వరుణ్ చక్రవర్తి, అశ్విన్ వంటి మేటి స్పిన్నర్లకు చుక్కలు చూపించాడీ హిట్టర్. టీఎన్‌పీఎల్‌లో వీరకొట్టుడుతో విరుచుకుపడిన డాషింగ్ బ్యాటర్ తమ జట్టు తిరుప్పూర్ తమిజాన్స్(Tiruppur Tamizhans) తొలిసారి విజేతగా నిలవడంలో కీలకమయ్యాడు. అందుకే.. కామెంటేటర్లు, అభిమానులు ముద్దుగా రాకెట్ రాహుజా అనే పేరుతో పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నమెంట్లో తన తడాఖా చూపించేందుకు సిద్ధమవుతున్నాడీ యంగ్‌స్టర్.
Meet Tushar Raheja, who has earned the sobriquet ‘Rocket Raheja’ in the TNPL circles
The 24-year-old aggressive left-hand batter has always been proficient against pace and in TNPL 2025 he levelled up, disrupting both Varun and Ashwin during Tiruppur Tamizhans’ run to their… pic.twitter.com/cGebSyBVmn
— ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2025
‘ఐపీఎల్లో ఆడాలనేది నా డ్రీమ్. అందుకోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నా. పద్దెనిమిదో సీజన్లో ప్రియాన్ష్ ఆర్య తరహాలో విధ్వంసక బ్యాటింగ్ చేయగలను. కానీ, దురదృష్టవశాత్తూ అవకాశం దక్కలేదు. దాంతో, వేలం తర్వాత నా ఆటను మెరుపుపరుచుకోవడంపై దృష్టి సారించాను. ప్రస్తుతానికి బుచ్చిబాబు టోర్నమెంట్, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నా’ అని చెబుతున్నాడీ తుషార్. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మిడిలార్డర్ బ్యాటర్‌గా అదరగొడుతున్న ఈ యువకెరటం నిలకడగా రాణిస్తున్నాడు. ఈ లీగ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో ఐపీఎల్ వేలానికి సిద్ధమేనని చాటుతున్నాడు తుషార్.
Tushar Raheja delivered consistency and took home the 𝗦𝗵𝗿𝗶𝗿𝗮𝗺 𝗖𝗮𝗽𝗶𝘁𝗮𝗹 𝗣𝗹𝗮𝘆𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗧𝗼𝘂𝗿𝗻𝗮𝗺𝗲𝗻𝘁 𝗮𝘄𝗮𝗿𝗱! 🏏✨#IDTTvDD #TNPL #TNPL2025 #TNPLFinal #NammaOoruNammaGethu pic.twitter.com/YGzlesxh99
— TNPL (@TNPremierLeague) July 6, 2025
‘నేను భారత మాజీ సారథి ధోనీకి వీరాభిమానిని. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఫినిషర్‌గా అతడి ఆట అద్భుతం. మాథ్యూ హేడేన్ సీఎస్కేకు ఆడిన రోజుల్లో నెట్స్‌కు వెళ్లి చూసేవాడ్ని. ఫాస్ట్ బౌలర్లపై అతడు ఆధిపత్యం చెలాయించడం చూసి నేను అలానే చెలరేగాలని అనుకునేవాడిని. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గేమ్ కూడా చాలా నచ్చుతుంది’ అంటున్న తుషార్ ఏదో ఒకరోజు ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియా జెర్సీ వేసుకోవాలని ఆరాటపడుతున్నాడు.
నిండా పాతికేళ్లు కూడా లేని తుషార్ అమ్ములపొదిలో ఎన్నో షాట్లు ఉన్నాయి. కవర్ డ్రైవ్, అప్పర్ కట్, స్వీప్ షాట్లతో అలరించే ఈ విధ్వంసక ఈ లెఫ్ట్ హ్యాండర్ క్రీజులో ఉంటే చాలు బౌలర్లు హడలెత్తిపోతారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్, అశ్విన్‌లు సైతం అతడిని కట్టడి చేయలేక చేతులెత్తేశారు. మొత్తంగా 9 మ్యాచుల్లో 185.55 స్ట్రయిక్ రేటుతో 488 పరుగులు సాధించాడీ పవర్ హిట్టర్. జూలై 7న జరిగిన ఫైనల్లో అశ్విన్ సారథ్యంలోని దిండిగుల్ డ్రాగన్స్‌పై 77 రన్స్‌తో విజృంభించిన తుషార్ జట్టు టైటిల్ కలను నిజం చేశాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును తన్నుకుపోయాడు.
— TNPL (@TNPremierLeague) July 6, 2025