భారత్-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. శ్రీలంకలో వన్డే ట్రై సిరీస్‌కు వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్లో అదరగొడుతున్న బ్యాటింగ్ సంచలనం, 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ భారత్-ఏ జట్టులోకి వచ్చాడు. వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఏ జట్టును సెలెక్టర్లు గురువారం ప్రకటించారు. వైభవ్ చోటు దక్కించుకున్న ఈ జట్టుకు హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యా డు.
న్యూఢిల్లీ : ఐపీఎల్లో అదరగొడుతున్న బ్యాటింగ్ సంచలనం, 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ భారత్-ఏ జట్టులోకి వచ్చాడు. వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఏ జట్టును సెలెక్టర్లు గురువారం ప్రకటించారు. వైభవ్ చోటు దక్కించుకున్న ఈ జట్టుకు హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యా డు. జూన్ 9 నుంచి జూన్ 21 వరకు డంబుల్లా వేదికగా జరిగే ఈ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక-ఏతో పాటు ఆఫ్ఘ్ఘానిస్తాన్-ఏ కూడా పాల్గొంటుంది. అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సూర్యవంశీని భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ముందుగా ‘ఏ’ జట్టులో అతడిని పరీక్షించాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది.
జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే సీనియర్ జట్టు యూకే పర్యటనకు ముందు జరిగే ఈ సిరీస్‌లో అతనికి అవకాశం కల్పించింది. ఈ జట్టు సగటు వయసు 23 ఏండ్ల్లు ఉండటం విశేషం. యశ్ ఠాకూర్, అర్షద్ ఖాన్, యుధ్వీర్ సింగ్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా 25 ఏళ్ల లోపు వారే. జట్టులో తిలక్, రియాన్ పరాగ్, అన్షుల్ కాంబోజ్ వంటి ఆటగాళ్లకు ఇప్పటికే సీనియర్ భారత జట్టు తరపున ఆడిన అనుభవం ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్ జూన్ 9, 15వ తేదీల్లో శ్రీలంక-ఏతో, 11, 17న ఆఫ్ఘాన్‌తో తలపడుతుంది. 21న ఫైనల్ జరుగుతుంది.
జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

