కొలంబో: శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీరా సోమవారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్
అవుతున్నట్లు ప్రకటించాడు. గురువారం లంక సెలక్టర్లు సమావేశం కానుండగా ఈలోపే తిసారా
తన నిర్ణయాన్ని తెలిపాడు. సోమవారం ఉదయం తన రిటైర్మంట్కు సంబంధించిన
విషయాన్ని శ్రీలంక క్రికెట్‌కు తెలియజేశాడు. 32ఏండ్ల పెరీరా తాను ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నాడు.
లంక తరఫున పెరీరా 166 వన్డేలు, 84టీ20లు, 6 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ 37 మ్యాచ్‌లు ఆడాడు. పురుషుల వన్డే క్రికెట్లో కనీసం 2000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో పెరీరా స్ట్రైక్‌రేట్ 112 కావడం విశేషం. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పెరీరా గుర్తింపుతెచ్చుకున్నాడు.