అబుధాబి : ఈనెల 27నుంచి సెప్టెంబరు 11వ తేదీవరకు జరుగనున్న ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీని శుక్రవారం ఆవిష్కరించారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశ టాలరెన్స్, కోఎగ్జిస్టెన్స్ శాఖ మ్రంతి షేక్ నహయాన్ ముబారక్ అల్ నహయాన్ ట్రోఫీని ఆవిష్కరించారు. వాస్తవానికి ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఆ దేశంలో రాజకీయ సంక్షోభం కారణంగా ఎమిరేట్స్‌కు మార్చారు.
ట్రోఫీ ఆవిష్కరణ కార్య్రకమంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని, శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వ, శ్రీలంక క్రికెట్ బోర్డు సిఈఒ ఆష్లే డిసిల్వ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సలహాదారు సుభాన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఫైనాన్స్-ఆపరేషన్స్ విభాగం జనరల్ మేనేజర్ తుషిత్, ఆసియా క్రికెట్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ పాల్గొన్నారు.