రోమ్: ఇటాలియన్ ఓపెన్ టోర్నీనుంచి టాప్ ర్యాంకర్ ఇగా సియాటెక్ తప్పుకుంది. ఎలెనా రిబకినాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మూడో సెట్లో కుడి కాలికి గాయమవడంతో సియాటెక్ మ్యాచ్‌నుంచి తప్పుకున్నది.
తొలి సెట్‌ను సియాటెక్ 6-2తో గెలుచుకోగా, రెండో సెట్‌ను రిబకినా 7-6 (7-3)తో గెలుచుకుని సమఉజ్జీగా నిలిచింది. ఇక మూడో సెట్లో ఇరువురూ చెరి రెండు గేమ్‌లు గెలుచుకున్న తరుణంలో కుడి కాలికి గాయమవడంతో సియాటెక్ మ్యాచ్ నుంచి, టోర్నీ నుంచి నిష్క్రమించింది.