యూరో వార్ నేడే
యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. గత కొన్ని రోజులుగా ఫుట్‌బాల్ అభిమానులకు పసందైన విందు అందిస్తున్న యూరో కప్ టైటిల్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.
- ఇంగ్లండ్, స్పెయిన్ ఫైనల్ పోరు
బెర్లిన్: యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. గత కొన్ని రోజులుగా ఫుట్‌బాల్ అభిమానులకు పసందైన విందు అందిస్తున్న యూరో కప్ టైటిల్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అసలు అంచనాలు లేకుండా బరిలోకి దిగి అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్న స్పెయిన్ ఒకవైపు అయితే వరుసగా రెండోసారి ఫైనల్ పోరులో నిలిచిన ఇంగ్లండ్ ఈసారైనా కప్‌ను ముద్దాడాలన్న పట్టుదలతో ఉంది.
భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12.30గంటలకు మొదలయ్యే స్పెయిన్, ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ అననున్నాయి. ఇప్పటి వరకు జర్మనీతో కలిసి అత్యధిక సార్లు(3) టైటిల్ దక్కించుకున్న స్పెయిన్ రికార్డు స్థాయిలో నాలుగో సారి టైటిల్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నది. కీలకమైన సెమీస్‌లో టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా భావించిన ఫ్రాన్స్‌పై స్పెయిన్ అద్భుత విజయం సాధించింది.
ముఖ్యంగా 16 ఏండ్ల నూనుగు మీసాల కుర్రాడు లామిన్ యమాల్ సంచలనం సృష్టించాడు. ఫ్రాన్స్ రక్షణశ్రేణిని ఏమారుస్తూ యమాల్ కొట్టిన గోల్ టోర్నీలో హైలెట్‌గా నిలిచింది. శనివారం 17వ పుట్టిన రోజు జరుపుకున్న యమాల్..స్పెయిన్ గెలిస్తే..అతి పిన్న వయసులో ట్రోఫీ గెలిచిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. మరోవైపు తమ సుదీర్ఘ కల సాకారం కోసం ఇంగ్లండ్ సత్తాచాటే అవకాశముంది. మొత్తంగా రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

