హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ వేదికగా జరిగిన రిలయన్స్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ప్లేయర్లు జయకేతనం ఎగరవేశారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో తెలంగాణ టీమ్ 4-0తో లయోల కాలేజీపై ఘన విజయం సాధించింది. స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన సిద్ధాంత్(బెస్ట్ ప్లేయర్), గిరిప్రకాశ్(బెస్ట్ గోల్‌కీపర్) సత్తాచాటారు. ఈ టోర్నీలో మొత్తం 24 టీమ్‌లు పోటీపడ్డాయి. విజేతగా నిలిచిన స్పోర్ట్స్ స్కూల్ ప్లేయర్లను శనివారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ వోఎస్డీ, హరికృష్ణ, ఫుట్‌బాల్ కోచ్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.