హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 3 నుంచి 7 దాకా నగరంలోని యూసుఫ్‌గూడలో గల కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డి స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఆదివారం మసాబ్ ట్యాంక్ మత్స్య శాఖ భవనంలో టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై ఆర్గనైజింగ్ కమిటీ సమావేశమైంది. ఈ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.