హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువతలో క్రీడాస్ఫూర్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించే ఉద్దేశంతో స్థానిక గాడియం స్కూల్ వేదికగా జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీ ‘జిమ్క్విన్’ రెండో ఎడిషన్ శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో దేశంలోని 15 రాష్ర్టాల నుంచి దాదాపు 850 మంది యువ జిమ్నాస్ట్లు పోటీపడుతున్నారు.
వీరిలో గాడియం స్కూల్ నుంచి 107 మంది విద్యార్థులు బరిలో ఉన్నారు. టోర్నీని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాడియం స్కూల్ చైర్మన్ కీర్తిరెడ్డి, కర్నల్ కమలేశ్మిశ్రా తదితరులు హాజరయ్యారు.