IPL 2024 Retentions: వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ ప్రక్రియకు నేటితో తెరపడింది. పది జట్లూ తాము రిటైన్, రిలీజ్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించాయి. గత సీజన్లో అత్యంత ధర పలికిన బెన్ స్టోక్స్ (సీఎస్కే), హ్యారీ బ్రూక్ (ఎస్ఆర్హెచ్) వంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేశాయి. ట్రేడ్లో ఇతర జట్లకు బదిలీ అయిన శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్ వంటి ఆటగాళ్లు కూడా వేలానికి వచ్చారు. రిటెన్షన్ లిస్ట్ వెల్లడైన తర్వాత పది జట్ల వద్ద ఉన్న పర్స్ వాల్యూను ఇక్కడ చూద్దాం.
వచ్చే నెల 19న (?) జరగాల్సి ఉన్న వేలానికి వెళ్లబోయే ముందు ఆర్సీబీ వద్ద అత్యధికంగా రూ. 40.75 కోట్ల నగదు ఉండగా అత్యల్పంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 13.85 కోట్ల నగదు ఉంది. మిగిలిన ఎనిమిది జట్ల పర్స్ వాల్యూ ఇలా..
– సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ. 34 కోట్లు
– కోల్కతా నైట్ రైడర్స్ – రూ. 32.7 కోట్లు
– చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 31.4 కోట్లు
– పంజాబ్ కింగ్స్ – రూ. 29.1 కోట్లు
– ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 28.95 కోట్లు
– ముంబై ఇండియన్స్ – రూ. 15.75 కోట్లు
– రాజస్తాన్ రాయల్స్ – రూ. 14.5 కోట్లు
– లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 13.9 కోట్లు