రన్నరప్ పొన్నప్ప జోడీ
సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్‌లో భారత జోడి తనీష క్రాస్టొ, అశ్విని పొన్నప్ప ద్వయం రన్నరప్‌తో సంతృప్తి చెందింది.
లక్నో : సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్‌లో భారత జోడి తనీష క్రాస్టొ, అశ్విని పొన్నప్ప ద్వయం రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తనీష-అశ్విని 14-21, 21-17, 15-21తో జపాన్ జోడి రిన్ ఇవనగ-కీ నకనిషి చేతిలో ఓడిపోయారు. తొలి గేమ్‌ను కోల్పోయిన తనీష-అశ్విని రెండో గేమ్‌ను గెలుచుకుని పోటీలో నిలిచారు. అయితే జపాన్ జోడి నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆరంభంనుంచి ఆధిక్యం ప్రదర్శించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను, టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
ఇతర ఫైనల్స్‌లో చిన్ యు జెన్ 20-22, 21-12, 21-17తో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోపై గెలుపొంది పురుషుల సింగిల్స్ టైటిల్‌ను, జపాన్‌కు చెందిన నజోమి ఒకుహర 21-19, 21-16తో డెన్మార్క్‌కు చెందిన లినె హోజ్‌మార్క్‌ను ఓడించి మహిళల సింగిల్స్ టైటిల్‌ను, ఇండోనీసియాకు చెందిన చూంగ్ హాన్ జియాన్-హైకల్ ముహ్మద్ 18-21, 21-18, 21-16తో జపాన్‌కు చెందిన అకిరా కోగ-తయాచి సైటొలపై విజయంతో పురుషుల డబుల్స్ టైటిల్దక్కించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

