పారిస్: గ్రీకు టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్‌కు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో షాక్ తగిలింది. గత టోర్నీ రన్నరప్ సిట్సిపాస్‌ను డెన్మార్క్ కుర్రాడు హోల్గర్ రూన్ చిత్తు చేసి ఔరా అనిపించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్లో సిట్సిపాస్ 5-7, 6-3, 3-6, 4-6తో రూన్ చేతిలో ఓడిపోయాడు.
హోరాహోరీగా సాగిన పోరులో సిట్సిపాస్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. తొలిసెట్‌ను ప్రత్యర్థికి కోల్పోయిన ఈ గ్రీక్ ప్లేయర్ రెండో సెట్‌ను దక్కించుకుని పోటీలోకి వచ్చాడు. అయితే వరుస సెట్లను చేజార్చుకోవడం సిట్సిపాస్ కొంపముంచింది.