అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. బ్యాచిలర్ జీవితానికి ఫుల్స్టాప్ పెడుతూ ఇటలీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ అండ్రియ ప్రెటీని వివాహమాడింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది.
ఏడు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన 45 ఏండ్ల వీనస్ తన కంటే ఎనిమిదేండ్లు చిన్నవాడైన అండ్రియా(37)ను పెండ్లి చేసుకోవడం విశేషం.