హైదరాబాద్, ఆట ప్రతినిధి : చెన్నై వేదికగా జరుగుతున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 1500మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) స్విమ్మర్ వ్రితి అగర్వాల్ 18:01:04సెకన్ల టైమింగ్తో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
ఇదే విభాగంలో శిరిన్(విశ్వేశ్వరయ్య), అశ్మిత చంద్ర(జైన్ యూనివర్సిటీ) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పతక ప్రదాన కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నిహార్ అమిన్, టీఎన్ఎస్ఏ కార్యదర్శి చంద్రశేఖరన్ పాల్గొన్నారు.