హైదరాబాద్, ఆట ప్రతినిధి: అసన్సోల్(పశ్చిమబెంగాల్) వేదికగా జరిగిన 58వ ఆల్ఇండియా రైల్వేస్ షూటింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ అదరగొట్టింది.
ఆసక్తికరంగా సాగిన టోర్నీలో మహిళల రైఫిల్ 50మీటర్ల ప్రోన్ విభాగంలో సురభి రజత పతకంతో మెరిసింది. అదే దూకుడు కొనసాగిస్తూ రైఫిల్ 50మీటర్ల త్రీ పొజిషన్లో కాంస్యం ఖాతాలో వేసుకుంది.