హైదరాబాద్, ఆట ప్రతినిధి: రోమ్ సిటీ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివెల్లో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఉప్పల ప్రణీత్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఇటలీలోని రోమ్ నగరం వేదికగా జరిగిన టోర్నీలో వివిధ దేశాల నుంచి 120 మంది ప్లేయర్లు పోటీపడ్డారు.
ఇందులో మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను ఏడు విజయాలు, రెండు డ్రాలతో ప్రణీత్ అగ్రస్థానంతో టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఇజ్రాయెల్ జెరూసలెంలో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో కూడా ప్రణీత్ మెరుగైన ప్రతిభ కనబరిచాడు.