హైదరాబాద్: జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ నిత్య సాగి రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన బాలికల 400మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసును నిత్య 5: 26:33 సెకన్లలో ముగించి రెండో స్థానంలోనిలిచింది.
రామచంద్ర హషిక(కర్ణాటక), రామనుజన్ రాఘవి(మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మొత్తంగా జాతీయ స్విమ్మింగ్ టోర్నీలో రాష్ట్ర స్విమ్మర్లు అంచనాలకు మించి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.