హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న 15వ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు గోవర్ధన్, దీక్షిత సత్తాచాటారు. శుక్రవారం జరిగిన అండర్-16 అప్టిమిస్టిక్ ఫ్లీట్ విభాగంలో గోవర్ధన్ తొమ్మిది పాయింట్లతో మరో రేసు మిగిలుండగానే స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. శనివారం జరిగే రేసులోనూ గెలిస్తే..బాబు స్మారక ట్రోఫీ కూడా ఖాతాలో వేసుకోనున్నాడు. దీక్షితకు రజతం ఖాయం కాగా, రాష్ర్టానికే చెందిన రిజ్వాన్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు.