హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : జాతీయ స్థాయి ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ జి.రాధిక సత్తా చాటారు. హర్యానాలోని కర్ణాల్లో జరిగిన అఖిల భారత పోలీస్ క్లస్టర్ టోర్నీ మహిళల 90 ప్లస్ కిలోల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.
రాధికను డీజీపీ సీవీ ఆనంద్ ఐజీ గజరావు భూపాల్, స్పోర్ట్స్ డీఎస్పీ రామారావు అభినందించారు.