హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలోఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. మహిళల సింగిల్స్ స్కల్ విభాగంలో హేమలత రజత పతకంతో మెరిసింది. పురుషుల క్వాడ్రాపుల్ స్కల్ ఈవెంట్లో జ్ఞానేశ్వర్, గణేశ్, సాయి వరుణ్, శ్రవణ్ కుమార్‌తో కూడిన రాష్ట్ర టీమ్ కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల స్కల్ కేటగిరీలో అనురాధ, ఉదయభాను మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు ఫెన్సింగ్‌లో రజతం, కాంస్యం దక్కాయి.