హైదరాబాద్, ఆట ప్రతినిధి: డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో మేము సైతం అందరూ చేతులు కలిపారు. ‘సే నో టూ డ్రగ్స్’ వ్యతిరేక ప్రచారంలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2, 3 తేదీల్లో టీ10 క్రికెట్ టోర్నీ జరుగనుంది. సాట్స్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగనున్న టోర్నీకి సంబంధించిన జెర్సీలను ఆదివారం ఆవిష్కరించారు. దీంతో పాటు జట్ల డ్రాలను విడుదల చేశారు.
లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే టోర్నీలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్, డాక్టర్స్, టీఎన్జీవో, టీజీవో, సివిల్ సర్వీసెస్, సినీ యాక్టర్స్ జట్లు పోటీపడుతున్నాయి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా అందివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపీనాథ్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేశ్, తదితరులు పాల్గొన్నారు.