హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ లిఫ్టర్ తేజావత్ సుకన్యను.. మెంటార్ వైవీ గోపాల కృష్ణమూర్తి అభినందించారు. బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన టోర్నీలో సుకన్య 76 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కంచుమోత మోగించిన విషయం తెలిసిందే. తద్వారా త్వరలో అమెరికా వేదికగా జరుగనున్న ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్నకు ఎంపికైన సుకన్య.. ఆ పోటీల్లోనూ సత్తాచాటాలని కృష్ణమూర్తి ఆకాంక్షించారు.