కివీస్‌తో టీమిండియా హోమ్ సీజన్ స్టార్ట్.. సౌతాఫ్రికాతో ముగింపు

ముంబై: టీమిండియా క్రికెట్‌కు చెందిన హోమ్ సీజన్‌ను బీసీసీఐ క్లియర్ చేసింది. 2021-22 సీజన్లో ఇండియా తన తొలి సిరీస్‌ను న్యూజిలాండ్‌తో ఆడనున్నది. భారత జట్టు స్వదేశీ సీజన్‌కు చెందిన షెడ్యూల్‌కు ఇవాళ బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. నవంబర్ 17న జైపూర్‌లో కివీస్‌తో టీ20 క్రికెట్ సిరీస్ ప్రారంభంకానున్నది. ఇక వచ్చే ఏడాది జూన్ 19వ తేదీన సౌతాఫ్రికాతో జరిగే టీ20 మ్యాచ్‌తో ఇండియా ఈ యేటి సీజన్‌ను ముగించనున్నది.
న్యూజిలాండ్‌తో రాంచీ, కోల్‌కతాలో మిగితా టీ20లను ఇండియా ఆడుతుంది. ఆ మ్యాచ్‌లు నవంబర్ 19, 21వ తేదీల్లో జరుగుతాయి. ఆ తర్వాత కాన్పూర్, ముంబైల్లో రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి టెస్టు నవంబర్ 25 నుంచి 29 వరకు, రెండవ టెస్టు డిసెంబర్ 3 నుంచి 7 వరకు జరుగుతుంది.
ఫిబ్రవరి ఆరవ తేదీన అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ జరగనున్నది. ఆ తర్వాత 9, 12 తేదీల్లో జైపూర్, కోల్‌కత్తాలో మిగితా రెండు వన్డేలు జరుగుతాయి. ఫిబ్రవరి 15వ తేదీన కటక్‌లో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. వైజాగ్, త్రివేండ్రంలో 18, 19 తేదీల్లో మిగితా మ్యాచ్‌లు జరుగుతాయి.
ఫిబ్రవరి 25వ తేదీన శ్రీలంకతో బెంగుళూరులో తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. మొహాలీలో రెండవ మ్యాచ్ మార్చి 5వ తేదీ నుంచి జరుగుతుంది. మొహాలీ, ధర్మశాల, లక్నోల్లో మూడు టీ20 ఉంటాయి. 13, 15, 18 తేదీల్లో ఆ మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇక జూన్ 9న సౌతాఫ్రికాతో చెన్నైలో తొలి టీ20 ప్రారంభంకానున్నది. మొత్తం అయిదు మ్యాచ్‌లు జరుగుతాయి. బెంగుళూరు, నాగపూర్, రాజ్‌కోట్, ఢిల్లీల్లో మిగితా టీ20లు ఉంటాయి. జూన్ 12, 14, 17, 19 తేదీల్లో ఆ మ్యాచ్‌లు జరుగుతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

