Adelaide Test | 3 ఓవర్లలో మూడు వికెట్లు.. క్యూకట్టిన కోహ్లి, రాహుల్, గిల్
అడిలైడ్ టెస్టులో (Adelaide Test) భారత్ కష్టాల్లో పడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మంచి ఊపుమీదున్న జైస్వాల్‌ను బోల్తా కొట్టించాడు. ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్లముందు దొరకబట్టాడు.
అడిలైడ్: అడిలైడ్ టెస్టులో (Adelaide Test) భారత్ కష్టాల్లో పడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మంచి ఊపుమీదున్న జైస్వాల్‌ను బోల్తా కొట్టించాడు. ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్లముందు దొరకబట్టాడు. దీంతో ఖాతా తెరవకుండానే భారత్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన గిల్‌తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఇద్దరు నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. అయితే 18.4వ ఓవర్లో రాహుల్‌ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. 64 బాల్స్‌లో 37 రన్స్ చేసిన రాహుల్ నాథన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
గత మ్యాచ్‌లో సెంచరీ చేసి టచ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 8 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. 7 రన్స్ చేసి స్టార్క్ (20.1 ఓవర్) బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో గిల్ (51 బంతుల్లో 31 రన్స్) కూడా ఔటయ్యాడు. దీంతో 3 ఓవర్ల వ్యవధిలోనే ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరడంతో టీమ్ఇండియా కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం రిషభ్ పంత్ (4), కెప్టెన్ రోహిత్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 4 వికెట్ల నష్టానికి 82 రన్స్ చేసింది.
2ND Test. WICKET! 21.1: Shubman Gill 31(51) lbw Scott Boland, India 81/4 https://t.co/upjirQCmiV #AUSvIND
— BCCI (@BCCI) December 6, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

