గులాబీ గుబాలింపు
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత.. అతడు పట్టిందల్లా బంగారంగా మారింది. స్వదేశంలో తిరుగులేని ప్రదర్శనతో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా వరుసగా నాలుగో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన గులాబీ టెస్టులో రోహిత్ సేన 238 పరుగుల తేడాతో శ్రీలంకను
- లంకను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా
- 2-0తో టెస్టు సిరీస్ కైవసం
- నిప్పులు చెరిగిన జస్ప్రీత్ బుమ్రా
- కరుణరత్నె పోరాటం వృథా
సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యంతో లంకను చిత్తు కింద కొట్టిన టీమ్ఇండియా.. మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది. పొట్టి ఫార్మాట్లో లంకేయులను క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. టెస్టుల్లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌శర్మకు ఇది వరుసగా నాలుగో సిరీస్ క్లీన్‌స్వీప్ కాగా.. శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి టెస్టు జట్టులో తమ ఎంపికకు న్యాయం చేశారు. మూడు రోజుల్లోనే ముగిసిన డే అండ్ నైట్ (గులాబీ) టెస్టులో వీర విజృంభణ కనబర్చిన మనవాళ్లు కాస్త విరామం తీసుకొని ఐపీఎల్ బరిలోకి దిగనున్నారు!
బెంగళూరు: స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత.. అతడు పట్టిందల్లా బంగారంగా మారింది. స్వదేశంలో తిరుగులేని ప్రదర్శనతో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా వరుసగా నాలుగో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన గులాబీ టెస్టులో రోహిత్ సేన 238 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 447 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 28/1తో సోమవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. 208 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దిముత్ కరుణరత్నె (107; 15 ఫోర్లు) సెంచరీతో పోరాడగా.. కుషాల్ మెండిస్ (54) అతడికి కాస్త సహకరించాడు. వీరిద్దరు మినహా తక్కినవాళ్లంతా విఫలం కావడంతో లంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4, జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధశతకాలు సాధించిన శ్రేయస్ అయ్యర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’.. రిషబ్ పంత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి. ఈ సిరీస్ విజయంతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఐదో స్థానంలో నిలిచింది. సొంతగడ్డపై ఇప్పటి వరకు ఆడిన మూడు (బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంక) డే అండ్ నైట్ టెస్టుల్లోనూ టీమ్ఇండియా విజయాలు సాధించింది. కెప్టెన్‌గా తొలి టెస్టు సిరీస్ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందన్న రోహిత్.. జడేజా, శ్రేయస్, పంత్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 252 (శ్రేయస్ అయ్యర్ 92, పంత్ 39; ప్రవీణ్ 3/81),
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ (మాథ్యూస్ 43; బుమ్రా 5/24, షమీ 2/18),
భారత్ రెండో ఇన్నింగ్స్: 303/9 డిక్లేర్డ్ (శ్రేయస్ 67, పంత్ 50, రోహిత్ 46; ప్రవీణ్ 4/78, లసిత్ ఎంబుల్దెనియా 3/87),
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 208 ఆలౌట్ (కరుణరత్నె 107, కుషాల్ మెండిస్ 54; అశ్విన్ 4/55, బుమ్రా 3/23).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

