Ashish Nehra | విరాట్ కోహ్లీ-గంభీర్ రిలేషన్‌పై మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు..!
Ashish Nehra | టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఎలాంటి సమస్య తనకు కనిపించడం లేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నారు.
Ashish Nehra | టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఎలాంటి సమస్య తనకు కనిపించడం లేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నారు. గౌతీ శ్రీలంక టూర్‌తో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనుండగా.. వన్డే సిరీస్‌లో కోహ్లీ చేరనున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో అప్పటి లఖనవూ సూపర్ జెయింట్స్ మెంటార్ అయిన గంభీర్, ఆర్సీబీ ఆటగాడైన కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందనే విషయంపై చర్చ జరుగుతున్నది.
దీనిపై ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశిష్ నెహ్రా స్పందించాడు. గత ఐపీఎల్ సీజన్లో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కనిపిచిందని.. ఇద్దరు కలిసిపోయారన్నారు. శ్రీలంక పర్యటనకు బయలుదేరే ముందు కోహ్లీతో గంభీర్ఱ తన రిలేషన్‌పై స్పందించాడని తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్ లోపల ఇద్దరి మధ్య విభేదాలు ఉండవని నెహ్రా అభిప్రాయపడ్డాడు. గంభీర్, కోహ్లి ఇద్దరూ చాలా ప్యాషనేట్‌గా ఉంటారని, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు జట్టు కోసం ఒక్కటవుతారని నెహ్రా స్పష్టం చేశాడు.
కోహ్లి, గంభీర్ ఇద్దరూ ఉద్వేగభరితమైన వ్యక్తులని.. ఇద్దరూ జట్టు కోసం ఆడినప్పుడల్లా ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టేవారని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసి ఉన్నప్పుడు జట్టు కోసం ఐక్యంగా ఉంటారని పేర్కొన్నాడు. గంభీర్ ఎప్పుడూ ముక్తసరిగా ఉంటాడని, తన మనసులోని మాటను మాత్రమే వింటాడని నెహ్రా తెలిపాడు. గంభీర్ పారదర్శకంగా ఉండడం మంచిదేనన్నాడు. ప్రతి ఒక్కరికీ సొంత కోంచింగ్ శైలి ఉంటుందని తాను భావిస్తున్నానని నెహ్రా చెప్పాడు. ఇదిలా ఉండగా.. భారత జట్టు ఈ నెల 27 నుంచి శ్రీలంకతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది. టీ20ల నుంచి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 2న మొదలయ్యే వన్డే సిరీస్‌కు ముందు కోహ్లీ జట్టుతో చేరనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

