హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉత్తరాఖండ్‌లోని బజ్పూర్ వేదికగా ఈ నెల 9 నుంచి 14 దాకా జరిగిన సీబీఎస్ఈ నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్-2024లో హైదరాబాద్‌కు చెందిన మేక తపస్య రజతం సాధించింది. అండర్-17 కేటగిరీ 44 కిలోల విభాగంలో పోటీపడ్డ తపస్య.. 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. హైదరాబాద్‌లోని శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్లో చదువుతున్న తపస్య.. తెలంగాణ రాష్ట్ర కోచ్ ఠాకూర్ సురేందర్ సింగ్ మార్గదర్శకత్వంలో ఆమె రాణిస్తోంది.