Tamim Iqbal | బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడిగా భారత మద్దతుదారుడు.. అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు..!
Tamim Iqbal : బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. అవినీతి ఆరోపణలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న బీసీబీకి కొత్త చీఫ్‌గా తమీమ్‌ను నియమించింది ప్రభుత్వం.
Tamim Iqbal : బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. అవినీతి ఆరోపణలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న బీసీబీకి కొత్త చీఫ్‌గా తమీమ్‌ను నియమించింది ప్రభుత్వం. అమినుల్ ఇస్లాం నేతృత్వంలోని బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం మంగళవారం ఈ మాజీ ఓపెనర్‌కు పగ్గాలు అప్పగించింది. ఇటీవల భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించిన తమీమ్ బీసీబీ అధ్యక్షుడు కావడంతో బీసీసీఐతో సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశముంది.
నిరుడు అక్టోబర్‌లో జరిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎన్నికల్లో అవకతవకల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. ఎన్నికల్లో అవినీతిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ తదుపరి బోర్డు అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ పేరును ప్రతిపాదించింది. దాంతో, అమినుల్ ఇస్లాం బృందాన్ని తొలగించిన ప్రభుత్వం తమీమ్‌కు అధికారాలు కట్టబెట్టింది.
BREAKING: The Bangladesh government has appointed Tamim Iqbal as the new BCB president after they dissolved the Aminul Islam-led board of directors on Tuesday
Full story: https://t.co/HAjMpvwz1F pic.twitter.com/Te1uzkrSvX
— ESPNcricinfo (@ESPNcricinfo) April 7, 2026
ప్రస్తుతం 37 ఏళ్లున్న తమీమ్ ఆ పదవికి ఎంపికైన అత్యంత చిన్న వయస్కుడిగా గుర్తింపు సాధించాడు. 11 మంది సభ్యుల అడ్‌హక్ కమిటీతో కలిసి బంగ్లాదేశ్ క్రికెట్ పురోగతికి తమీమ్ చర్యలు చేపట్టనున్నాడు. మాజీ కెప్టెన్ మిన్హజుల్ అబెదిన్, మాజీ ఆటగాడు అతర్ అలీ ఖాన్, రష్నా ఇమాన్, మిర్జా యాసిర్ అబ్బాస్, సయ్యద్ ఇబ్రహీం, ఇస్రాఫిల్ తంజిల్ చౌదురి, సల్మాన్ ఇస్పహని, రఫికుల్ ఇస్లాం, ఫహీం సిన్హాలు సభ్యులు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

