దుబాయ్: అన్ని రంగాల్లో టీమిండియా చూపిన ఆధిపత్యం ముందు పసికూన స్కాట్లాండ్ ఘోరంగా ఓడింది. కానీ ఎక్కడా పోరాటపటిమను వదల్లేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఓపెనర్లిద్దరూ అవుటవడమే దానికి నిదర్శనం. కేవలం ఆటలోనే కాదు, మిగతా అంశాల్లో కూడా టీమిండియాను, స్కాట్లాండ్తో పోల్చలేం.
బీసీసీఐ నెలరోజుల్లో ఆర్జించే సొమ్ము సంపాదించాలంటే స్కాట్లాండ్కు కనీసం ఏడాది పడుతుంది. అలాంటి స్థితిలో ఉన్న స్కాట్లాండ్ ఈ టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 స్టేజ్‌కు రావడమే ఎక్కువ. అలాంటి జట్టు.. భారత్‌పై విజయం మాట పక్కనపెడితే, కనీసం పోటీ ఇవ్వడమూ గొప్పే. అయితే స్కాట్లాండ్ జట్టు ఎక్కడా నిరుత్సాహపడలేదు.
తమ ప్రయత్నం తాము చేసింది. ఈ ఒక్క విషయం చాలు, వారిని గౌరవించడానికి. ఇదే ఆలోచన వచ్చినట్లుంది టీమిండియా ఆటగాళ్లకు. మ్యాచ్ అనంతరం స్కాట్లాండ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి ఆ దేశ ఆటగాళ్లందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. కోహ్లీ, బుమ్రా, అశ్విన్, రోహిత్ శర్మ అంతా కలిసి వెళ్లి స్కాట్లాండ్ ఆటగాళ్లతో ముచ్చటించారు.
ఈ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు ‘వెల కట్టలేనివి’ అంటూ ఆ ఫొటోలను పంచుకుంది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, కొన్ని రోజుల క్రితం భారత్‌తో మ్యాచ్ గురించి మాట్లాడిన స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోట్జర్.. కోహ్లీ వంటి ఆటగాడితో కలిసి మైదానంలో ఆడటం తమకు గొప్ప అనుభవమని చెప్పిన సంగతి తెలిసిందే.
Huge respect to @imVkohli and co. for taking the time 🤜🤛 pic.twitter.com/kdFygnQcqj
— Cricket Scotland (@CricketScotland) November 5, 2021
Priceless. pic.twitter.com/fBEz6Gp5fL
— Cricket Scotland (@CricketScotland) November 5, 2021