Tokyo Olympics: చరిత్ర సృష్టించనున్న 12 ఏళ్ల సిరియా ఒలింపియన్

టోక్యో: 12 ఏళ్ల వయసులో మీరు ఏం చేస్తున్నారు? మనలో చాలా మంది బహుశా ఆరు లేదా ఏడో తరగతిలో చదువుకుంటూ ఉంటాం. కానీ నిత్య రణభూమిగా ఉండే సిరియాలాంటి దేశం నుంచి వచ్చిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ హెండ్ జాజా మాత్రం టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించబోతోంది. ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలే. ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అతి పిన్న వయసు అథ్లెట్ జాజానే కావడం విశేషం. అంతర్యుద్ధంతో సతమతమయ్యే సిరియాలాంటి దేశంలో ఆటలను కెరీర్‌గా తీసుకోవడమే సాహసమనుకుంటే.. ఆమె మాత్రం ఏకంగా 12 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్‌లో ఆడబోతోంది.
52 ఏళ్ల తర్వాత..
ఆల్‌టైమ్ యంగెస్ట్ ఒలింపియన్లలో ఒకరిగా జాజా నిలవబోతోంది. చివరిసారి 1968 ఒలింపిక్స్‌లో 11 ఏళ్ల ఫిగర్ స్కేటర్ బీట్రైస్ హుస్టియు తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంత తక్కువ వయసున్న అథ్లెట్ ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేస్తోంది. ఈ నెల నుంచి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభమైన తర్వాత జాజా చరిత్ర సృష్టించనుంది. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకారం ఆమె పుట్టింది 2009, జనవరి 1న. ఆ లెక్కన ఆమె వయసు 12 ఏళ్ల 6 నెలలు.
ప్రస్తుతం ఆమె అండర్-13 బాలికల కేటగిరీలో ప్రపంచంలో 46వ ర్యాంక్‌లో ఆమె ఉంది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్‌తో తలపడబోతోంది. స్వదేశంలో యుద్ధ వాతావరణాన్నే కాదు.. ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను కూడా ఎదుర్కొని ఆమె ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. గతేడాది ఫిబ్రవరి 2020లో జోర్డాన్‌లో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఆమె అర్హత సాధించింది.
ఒలింపిక్స్‌లో యంగెస్ట్ అథ్లెట్ ఎవరు?
హెండ్ జాజా ఈ టోక్యో ఒలింపిక్స్‌లో యంగెస్ట్ అథ్లెట్. మరి ఓవరాల్‌గా ఒలింపిక్స్‌లో యంగెస్ట్ అథ్లెట్ ఎవరో తెలుసా? అతని పేరు దిమిత్రియోస్ లౌండ్రాస్. అతడో గ్రీకు జిమ్నాస్ట్. 1896లో జరిగిన తొలి ఆధునిక ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ఆ సమయానికి అతని వయసు కేవలం 10 ఏళ్లు మాత్రమే. అంతేకాదు టీమ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ కూడా గెలిచాడు.
ఐదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టి..
సిరియాలో సాధారణ బతుకుపోరు సాగించడమే చాలా కష్టం. అలాంటిది హెండ్ జాజా మాత్రం ఐదేళ్ల వయసులోనే 2014లో బ్యాట్ పట్టింది. తన అన్నతో కలిసి ఆడుతున్న ఆమెను కోచ్ అధమ్ అల్జమాన్ చూసి స్థానిక క్లబ్‌కు తీసుకెళ్లాడు. యుద్ధంతో సతమతమవుతున్న దేశంలో ఈ టేబుల్ టెన్నిస్‌ను ఆటవిడుపుగా మలచుకున్న ఆమె.. ఇప్పుడు సిరియా నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

