Cincinnati Open : వరల్డ్ మూడో సీడ్ ఇగా స్వియాటెక్ (Iga Swiatek) కోర్టులో యూఎస్ ఓపెన్ సన్నాహక టోర్నీలో జోరు చూపిస్తోంది. ఈమధ్యే వింబుల్డన్ (Wimbledon) విజేతగా నిలిచిన ఆమె సిన్సినాటి ఓపెన్ (Cincinnati Open) టోర్నమెంట్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠగ సాగిన సెమీఫైనల్లో ఎలీనా రిబాకినాను చిత్తుగా ఓడించింది. రెండో సెమీస్‌లో ఏడోసీడ్ జాస్మినె పౌలొని అతికష్టమ్మీద గెలిచింది. తద్వారా రెండోసారి డబ్ల్యూటీఏ 1000 ఫైనల్‌కు దూసుకెళ్లింది.
సెమీఫైనల్లో రిబాకినా హోరాహోరీగా తలపడ్డారు. తొలిసెట్‌ను 7-5తో గెలుచుకున్న స్వియాటెక్ రెండో సెట్లో మరింత దూకుడు కనబరిచింది. రెండో ఫైనలిస్ట్ జాస్మినే పౌలోని (ఇటలీ) మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. అన్‌సీడెడ్ వెరోనికా కుదెర్మొటోవా ధాటికి రెండో సెట్ కోల్పోయినా.. ఆ తర్వాత పుంజుకొని మూడో సెట్ కైవసం చేసుకుంది. పౌలోని – స్వియాటెక్ మ్యాచ్ విషయానికొస్తే.. మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఇరువురు ఐదుసార్లు తలపడగా అన్నింటా విజయం సాధించింది. ఆగస్టు 24నుంచి యూఎస్ ఓపెన్ (US Open) ప్రారంభం అవుతుంది.
Iga Swiatek qualifies for the 2025 WTA Finals.
And she’s only gotten better & better as the season’s gone on.
🇵🇱❤️ pic.twitter.com/bl9fmZG1Vy
— The Tennis Letter (@TheTennisLetter) August 17, 2025