సిడ్నీ: ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ ఆట తీరు అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. అతని బ్యాటింగ్ శైలిని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మెచ్చుకుంటున్నారు. టీ20 క్రికెట్లో వెరైటీ షాట్లతో సూర్యకుమార్ అలరిస్తున్న విషయం తెలసిఇందే. పాక్ మాజీ క్రికెటర్ షోయెబ్ మాలిక్ తెగ ప్రశంసలు కురిపించాడు. చాలా రకాల షాట్లు సూర్య ఆడగలడని షోయెబ్ తెలిపారు. బౌలర్ మైండ్‌ను అంచనా వేసి మరీ సూర్య షాట్లు కొడుతున్నాడని కితాబు ఇచ్చారు.
ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ షోయెబ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లోని పేస్, బౌన్స్‌ను సూర్య ఎలా వాడుకుంటున్నారన్న అంశంపై షోయెబ్ మాలిక్, వసీం అక్రమ్‌లు చర్చించుకున్నారు. అయితే బౌలర్‌ను అంచనా వేసి స్కూప్, ల్యాప్ షాట్లలను సూర్య కొడుతున్న తీరు అద్భుతమని షోయెబ్ మెచ్చుకున్నాడు. షాట్లు కొట్టే తీరు, అతని వద్ద ఉన్న టెక్నిక్ చాలా బాగున్నాయని, షార్ట్ కొట్టేందుకు ఎలివేషన్ లేకున్నా.. అలాంటి స్థితిలోనూ అతను తన షాట్‌ను సమర్థవంతంగా ఆడుతున్నాడని షోయెబ్ తెలిపాడు.
బౌలర్ మెదడులో ఉన్న ఆలోచనల రీతిలో సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడని, ఒకవేళ బ్యాటర్ షార్ట్ బాల్స్ బాగా ఆడితే, అప్పుడు బౌలర్ ఫుల్ లెన్త్ బాల్స్ వేస్తాడని, ఆ సమయంలోనూ సూర్య తన హిట్టింగ్ కొనసాగిస్తున్నాడని మాలిక్ అన్నాడు. సౌతాఫ్రికాతో పెర్త్‌లో జరిగిన మ్యాచ్ సూర్య ఆడలేమనుకున్నామని, కానీ అతను కీలకమైన 68 రన్స్ చేశాడని షోయెబ్ తెలిపాడు.