ICC Awards: చరిత్ర సృష్టించిన మిస్టర్ 360.. వరుసగా రెండో ఏడాది ప్రతిష్టాత్మక అవార్డు సొంతం
ICC Awards: 2023లో సూర్య వన్డేలలో విఫలమైనా టీ20లలో మాత్రం తనదైన ఆటతో రెచ్చిపోయాడు. గతేడాది ఈ విధ్వంసక బ్యాటర్.. 17 ఇన్నింగ్స్‌లలోనే 48.86 సగటుతో 733 పరుగులు చేశాడు.
ICC Awards: పొట్టి క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాటర్, అభిమానులంతా మిస్టర్ 360గా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండో ఏడాది పొట్టి క్రికెట్ ఫార్మాట్లో ‘ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ఆఫ్ ది ఈయర్’ అవార్డు గెలుచుకున్నాడు. గతేడాది కూడా ఈ అవార్డు సూర్యనే వరించింది. దీంతో ఈ అవార్డును వరుసగా రెండుసార్లు గెలిచిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
2023లో సూర్య వన్డేలలో విఫలమైనా టీ20లలో మాత్రం తనదైన ఆటతో రెచ్చిపోయాడు. గతేడాది ఈ విధ్వంసక బ్యాటర్.. 17 ఇన్నింగ్స్‌లలోనే 48.86 సగటుతో 733 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ 155.95గా ఉండటం గమనార్హం. 17 ఇన్నింగ్స్‌లలో సూర్య రెండు శతకాలు కూడా నమోదుచేశాడు.
An arsenal of eclectic shots and a striking average 🔥
The India batter lit up 2023 to win the ICC Men’s T20I Cricketer of the Year award ✨https://t.co/XYqFZcqres
— ICC (@ICC) January 24, 2024
ఈ అవార్డు కోసం సూర్య జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా, న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్మన్, అల్పేశ్ రమ్‌జాని (ఉగాండా)లతో పోటీ పడ్డాడు. కానీ ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న సూర్యాభాయ్ వైపే ఐసీసీ మొగ్గుచూపింది. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత్‌ను నడిపించిన సూర్య.. సఫారీ టూర్లో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభం నాటికి అతడు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలని భావిస్తున్నాడు.
Suryakumar Yadav won the ICC Men’s T20I cricketer of the year award. 🇮🇳 pic.twitter.com/JUBUy4brD0
— Johns. (@CricCrazyJohns) January 24, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

