Suryakumar Yadav | బెంగళూరు: ఐపీఎల్-17లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు శుభవార్త. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే ముంబైతో చేరనున్నాడు. బుధవారం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో నిర్వహించిన అన్ని రకాల ఫిట్నెస్ పరీక్షలనూ సూర్య క్లీయర్ చేసినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
గురువారం అతడు ఎన్సీఏ నుంచి రిటర్న్ టు ప్లే (ఆర్టీపీ) సర్టిఫికెట్ అందుకున్న తర్వాత ముంబై క్యాంప్‌లో చేరతాడని సమాచారం. ఈ నెల 7 లేదా 11న అతడు ముంబై తరఫున మ్యాచ్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.