ముల్లాన్‌పూర్: కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్.. బ్యాట్ టెస్ట్(Bat Test)లో దొరికిపోయాడు. పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేసేందుకు పిచ్‌పై వెళ్లడానికి ముందు.. బ్యాట్ టెస్ట్ చేశారు. ఆ పరీక్షలో సునిల్ నరైన్ విఫలం అయ్యాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల క్రికెటర్ల బ్యాట్లను చెక్ చేస్తోంది.సైజుకు మించి వాడుతున్న బ్యాట్లను చెకింగ్ ద్వారా పట్టేస్తున్నారు. అయితే మంగళవారం బౌండరీ లైన్ వద్ద బ్యాట్ చెకింగ్ చేస్తున్నప్పుడు సునిల్ నరైన్ బ్యాట్ ఎక్కువ వెడల్పు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతను బ్యాట్‌ను మార్చాల్సి వచ్చింది. అయితే టోర్నీలో అతను అక్రమ రీతిలో బ్యాట్‌ను వినియోగించాడా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ముల్లాన్‌పూర్‌లో జరిగన మ్యాచ్‌లో మరో బ్యాటర్ అన్రిచ్ నోర్జా కూడా బ్యాట్ పరీక్షలో చిక్కాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి వెళ్లిన సమయంలో బ్యాట్ చెక్ చేశాడు. బ్యాట్ సైజ్ పరిమితి దాటినట్లు గుర్తించారు. నరైన్ తరహాలోనే అతని బ్యాట్‌ను కూడా మార్పించారు. రిజర్వ్ అంపైర్ సయ్యిద్ ఖాలిద్ .. కేకేఆర్ బ్యాటర్ల బ్యాట్లను చెకింగ్ చేశాడు. బ్యాట్ పరీక్ష జరుగుతున్న సమయంలో కేకేఆర్ యువ బ్యాటర్ ఆంగ్రిశ్ రఘువంశీ అక్కడే ఉన్నాడు. అతని బ్యాట్‌కు చేసిన టెస్టులో అతను గట్టెక్కాడు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం .. బ్యాట్ ఫేస్ వద్ద వెడల్పు 10.79 సెంటీమీటర్లు, బ్యాట్ బ్లేడ్ వద్ద మందం 6.7 సెంటీమీటర్లు ఉండాలి. ఇక బ్యాట్ ఎడ్జ్ వద్ద వెడల్పు 4 సెంటీమీటర్లు, అలాగే బ్యాట్ పొడుగు 96.4 సెంటీమీటర్లు ఉండాలి.
Glad Narine is getting pulled up at least while batting. pic.twitter.com/GziclyTc1x
— Sunil (@Hitting_Middle) April 16, 2025