బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో ఒకింత వివాదం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ ఇచ్చేందుకు బోర్డర్‌ను ఆహ్వానించిన నిర్వాహకులు అదే సమయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ను విస్మరించారు. అక్కడే మ్యాచ్‌పై విశ్లేషిస్తున్న తనను ఆహ్వానించకపోవడంపై గవాస్కర్ తనదైన రీతిలో స్పందించాడు. ‘ట్రోఫీ ప్రదాన కార్యక్రమానికి నేను కూడా రావాలనుకున్నా. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అంటేనే భారత్-ఆస్ట్రేలియా సమరం. ఆ సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. నేను భారతీయున్ని కాబట్టే నన్ను పిలువలేదనుకుంటా’ అని అన్నాడు.