Sumit Nagal : భారత టెన్నిస్ యువకెరటం సుమిత్ నగాల్(Sumit Nagal) మరో సూపర్ విక్టరీ కొట్టాడు. మాంటే కార్లో మాస్టర్స్ క్వాలిఫయర్స్(monte carlo masters qualifiers)లో నగాల్ 63వ ర్యాంకర్‌కు షాకిచ్చాడు. సంచలన ఆటతో ఇటలీకి చెందిన ఫ్లావియో కొబొల్లి(Flavio Cobolli)పై 6-2, 6-3తో గెలుపొందాడు. ఈ విజయంతో అతడు ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లాడు. తర్వాతి పోరులో నగాల్ అర్జెంటీనా ప్లేయర్‌తో తలపడనున్నాడు.
ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న నాగల్ ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open 2024)లో బోణీ కొట్టాడు. తొలి రౌండ్లో కజకిస్థాన్ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్(Alexander Bublik)పై గెలుపొందాడు.
Happy to start with a win in Monte Carlo, one of the most beautiful tennis venues in the world 😍 pic.twitter.com/7IL422gUOG
— Sumit Nagal (@nagalsumit) April 6, 2024
తద్వారా నగాల్ మూడేండ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అంతేకాదు గ్రాండ్‌స్లామ్ చరిత్రలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా నగాల్ రికార్డు నెలకొల్పాడు. 1988లో రమేశ్ కృష్ణన్(Ramesh Krishnana) తొలిసారి ఈ ఫీట్ సాధించాడు.