జొహొర్ (మలేషియా) : ప్రతిష్టాత్మక సుల్తాన్ జొహొర్ కప్‌లో భారత జూనియర్ హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం భారత్.. 4-2తో న్యూజిలాండ్‌పై గెలిచింది.
అర్ష్‌దీప్ సింగ్ (2వ నిమిషంలో), పీబీ సునీల్ (15 ని.), అరైజీత్ సింగ్ (26 ని.), రొమన్ కుమార్ (47 ని.) తలా ఒక గోల్ చేశారు. తొలి మ్యాచ్‌లో భారత్.. 3-2తో బ్రిటన్ను ఓడించింది. ఈ టోర్నీలో భారత జట్టు మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.