Stephanie Frappart | ఫిఫాలో సంచలనం సృష్టించిన స్టెఫానీ ఫ్రాఫర్ట్.. ఇంతకీ ఆమె చేసిందేంటి?
Stephanie Frappart | ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఫీల్డ్ రిఫరీగా ఫ్రాన్స్‌కు చెందిన స్టెఫానీ ఫ్రాపర్ట్ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఫీల్డ్ రిఫరీగా పనిచేసిన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది ఫ్రాపర్ట్.
Stephanie Frappart | ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్ జోరుమీద జరుగుతున్నది. అంచనాలకు అందకుండా గెలుపోటములు దోబూచులాడుతున్నాయి. ఈ నెల ఒకటిన కోస్టారికా, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ రిఫరీగా ఫ్రాన్స్‌కు చెందిన స్టెఫానీ ఫ్రాపర్ట్ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఫీల్డ్ రిఫరీగా పనిచేసిన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది ఫ్రాపర్ట్.
ఫుట్‌బాల్ ఆట కొనసాగేది 90 నిమిషాలే! అదనపు సమయంతో కలుపుకొంటే మ్యాచ్ మరో 20 నిమిషాలు ఎక్కువ సాగుతుంది. ఆట మొదలైనప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ (45 నిమిషాలు) పూర్తయ్యే వరకు ఆటగాళ్లతోపాటు రిఫరీ కూడా పరిగెత్తాల్సి ఉంటుంది. బ్రేక్ తర్వాత మరో 45 నిమిషాలు కూడా గ్రౌండ్ అంతా పాదరసంలా కదులుతూనే ఉండాలి. మొత్తంగా మ్యాచ్ పూర్తయ్యేటప్పటికి ఫీల్డ్ రిఫరీ సగటున 11 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. ఆటగాళ్లతో ఆటగాడిగా పరుగులు తీస్తే వారిని రిఫరీ అని ఎందుకు అంటాం? వారి ఒక్క నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయవచ్చు. అందుకే, చాలా నిబద్ధతతో పనిచేస్తుంటారు. గ్రౌండ్లో ఉన్నంత సమయం బంతి కదలికలపై దృష్టి సారించాలి. ఆటగాళ్ల అడుగులపై కన్నేయాలి. బంతిని ఎలా లిఫ్ట్ చేస్తున్నారో గమనించాలి. ఎవరిని ఎవరు నెడుతున్నారో గుర్తించాలి. ‘కావాలని నెట్టుకున్నారా? పొరపాటుగా ఢీ కొన్నారా?’ అని అంచనాకు రావాలి. జర్మనీ, కోస్టారికా మ్యాచ్‌లో ఇన్ని పనులను కనుసైగలతో శాసించి ‘ఔరా!’ అనిపించుకుంది స్టెఫానీ ఫ్రాపర్ట్.
ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాపర్ట్ పదేండ్ల వయసులోనే ఫుట్‌బాల్ గ్రౌండ్లో అడుగుపెట్టింది. ఆ వయసులో ఆమె ఆటకన్నా, ఆటగాళ్లను పరిశీలిస్తున్న రిఫరీ పనితనంపైనే మనసుపడింది. అందుకే పదమూడేండ్ల వయసులో రిఫరీగా మైదానంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అప్పటి నుంచి రిఫరీగా కొనసాగాలనే నిర్ణయించుకుంది. జాతీయస్థాయి, క్లబ్ మ్యాచ్‌లకు రిఫరీగా చేస్తూ 2009లో ఫిఫా ఇంటర్నేషనల్ రిఫరీ ప్యానెల్లో చోటు దక్కించుకుంది. అప్పుడు ఆమె వయసు 26 ఏండ్లు. 2019 యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్, ఫ్రెంచ్లీగ్ మ్యాచ్‌లలో రిఫరీగా పనిచేసింది. తాజాగా ఫిఫా వరల్డ్ కప్‌లో విధులు నిర్వర్తించి రికార్డు సృష్టించింది ఫ్రాపర్ట్. జర్మనీ, కోస్టారికా మ్యాచ్‌లో ఆమె 245 నిర్ణయాలు తీసుకుంది. ఏ వివాదాలూ లేకుండా మ్యాచ్‌ను ముగించి అందరి మన్ననలు అందుకుంది.
Read More :
“Anvitha Reddy | ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాలు అధిరోహించడమే ఈ తెలంగాణ బిడ్డ సంకల్పం”
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

