హైదరాబాద్, ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరుగుతున్న జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ సైక్లిస్టు ఆశీర్వాద్ సక్సేనా పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల జూనియర్ 15కి.మీల పాయింట్ రేసులో 240 పాయింట్లతో రజత పతకం దక్కించుకున్నాడు. ఇప్పటికే టోర్నీలో రజతం గెలిచిన ఆశీర్వాద్కు ఇది రెండోది.
టోర్నీలో నిలకడగా రాణిస్తున్న ఆశీర్వాద్ను రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.