హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలోఇండియా యూత్ గేమ్స్‌లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మళ్లీ మెరిసింది. శనివారం జరిగిన మహిళల 1500మీటర్ల ఫ్రీస్టయిల్ రేసులో వ్రితి పసిడి పతకం సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన వ్రితి 18:20: 56సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. శనివారంతో ముగిసిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ టీమ్ ఏడు స్వర్ణాలు, ఆరు రజతాలు, 12 కాంస్య పతకాలు మొత్తం 25 పతకాలతో 13వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర(161), హర్యానా(128) టాప్-2 దక్కించుకున్నాయి.