బెంగళూరు: జాతీయ క్యాంప్ కోసం ఎంపిక చేసిన భారత హాకీ జట్టు ప్రాబబుల్స్‌లో తెలంగాణ యువ ప్లేయర్ ఈదుల జ్యోతిరెడ్డి చోటు దక్కించుకుంంది. స్వదేశం వేదికగా వచ్చే నెల 11 నుంచి మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా 33 మందితో కూడిన జట్టును హాకీ ఇండియా(హెచ్ఐ) శనివారం ప్రకటించింది. బెంగళూరులోని జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఆదివారం నుంచి అక్టోబర్ 9 వరకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారితో తుది జ ట్టును ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉంటే జాతీయ హాకీ జట్టుకు ఎంపికైన జ్యోతిరెడ్డిని శనివారం సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ప్రత్యేకం గా అభినందించారు. సాట్స్ నుంచి పూర్తి సహా య, సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు.