SRH vs KKR : చెపాక్లో జరుగుతున్న ఫైనల్లో మిచెల్ స్టార్క్(Mitchell Starc) బుల్లెట్ బంతులతో సన్రైజర్స్ బ్యాటర్లను వణికిస్తున్నాడు. ప్రతి బంతికి వికకెట్ తీసేంతలా బౌలింగ్ చేస్తున్న అతడు తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ(2)ను బౌల్డ్ చేసి కమిన్స్ సేనకు షాకిచ్చాడు. ఆ తర్వాత మరోసారి బంతి అందుకున్న అతడు క్రీజులో కుదురుకున్న రాహుల్ త్రిపాఠి(9)ని బోల్తా కొట్టించాడు.
అంతే.. 21 పరుగులకే హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఎడెన్ మర్క్రమ్(15), తెలుగబ్బాయి నితీశ్ కుమార్ రెడ్డి(8) ఆడుతున్నారు. వైభవ్ ఆరోరా వేసిన ఆరో ఓవర్ల్ మర్క్రమ్ వరుసగా రెండు ఫోర్లు, నితీశ్ ఒక సిక్సర్ బాదారు. దాంతో పవర్ ప్లేలో హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 40 రన్స్ కొట్టింది.