లక్నో: భారత మాజీ స్పిన్నర్ శ్రీధరన్ శ్రీరామ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లోక్నో సూపర్ జెయింట్స్‌కు సహాయక కోచ్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం లక్నో జట్టుకు జస్టిన్ లాంగర్ హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తుండగా.. విజయ్ దహియ (అసిస్టెంట్ కోచ్), ప్రవీణ్ తాంబే (స్పిన్ బౌలింగ్ కోచ్), మోర్నీ మోర్కెల్ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), జాంటీ రోడ్స్ (ఫీల్డింగ్ కోచ్) సహాయక బృందంలో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీరామ్ కూడా చేరాడు.