World Cup Qualifiers 2023 | సూపర్ సిక్స్‌లో భారీ విజయం.. వరల్డ్ కప్ పోటీలో నిలిచిన శ్రీలంక
World Cup Qualifiers 2023 : మాజీ చాంపియన్ శ్రీలంక(Srilanka) వన్డే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్(World Cup Qualifiers 2023)లో భాగంగా ఈరోజు జరిగిన సూపర్ సిక్స్(Super Six) మ్యాచ్‌లో జింబాబ్వే(Zimbabwe)పై భారీ విజయం సాధించింది. మహీశ్ థీక్షణ( Maheesh Theekshana) 4 వికెట్ల ప్రదర్శన...
World Cup Qualifiers 2023 : మాజీ చాంపియన్ శ్రీలంక(Srilanka) వన్డే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్(World Cup Qualifiers 2023)లో భాగంగా ఈరోజు జరిగిన సూపర్ సిక్స్(Super Six) మ్యాచ్‌లో జింబాబ్వే(Zimbabwe)పై భారీ విజయం సాధించింది. మహీశ్ థీక్షణ( Maheesh Theekshana) 4 వికెట్ల ప్రదర్శనకు తోడూ ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా(101 నాటౌట్) సెంచరీ బాదడంతో 9 వికెట్ల తేడాతో గెలిచింది. 8 పాయింట్లతో వరల్డ్ కప్‌కి క్వాలిఫై అయింది.
అయితే.. జింబాబ్వే వరల్డ్ కప్ ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. మంగళవారం స్కాట్లాండ్తో మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టు కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. స్కాట్లాండ్ కూడా టోర్నమెంట్ నుంచి వైదొలిగింది.
వన్డేల్లో 10వ సెంచరీ
క్వీన్స్ స్టోర్ట్స్ క్లబ్(Queens Sports Club)లో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, ఆ జట్టు 165 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ సియాన్ విలియమ్స్(56) అర్ధ శతకంతో రాణించాడు. యువ స్పిన్నర్ మహీశ్ థీక్షణ 4 వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీశాడు.
ప్రథుమ్ నిస్సంక

స్వల్ప లక్ష్యాన్ని లంక ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ ప్రథుమ్ నిస్సంక(101 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో అతడికి ఇది 10వ సెంచరీ. కుశాల్ మెండిస్(25)తో కలిసి నిస్సంక జట్టును గెలిపించాడు. 33.1 ఓవర్లలోనే లంక టార్గెట్‌ను చేరుకుంది. 2011 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన లంక ఈసారి టైటిల్ వేటకు సిద్ధమవుతోంది. ఈఏడాది వన్డే వరల్డ్ కప్ భారత గడ్డపై జరగనుంది.
ఇవి కూడా చదవండి
Team India Historic Moments | భారత క్రికెట్లో మధుర ఘట్టాలు.. చారిత్రాత్మక విజయాలు ఇవే..!
Sourav Ganguly | వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ కంటే గొప్ప మ్యాచ్ అదే : గంగూలీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

